10-10-2025 01:45:48 AM
-ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ డి మాండ్ చేశారు. పెంచిన బస్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ ఛలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ముఠా జయసింహ, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బస్సులో ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా బస్ చార్జీలను పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపిందని మండిపడ్డారు. ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోని ప్రభుత్వం వారి పై అదనంగా భారం మోపడం ఏంటని ప్రశ్నించారు. ముషీరాబాద్ నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్లు రాకేష్ కుమార్, శంకర్ ముదిరాజ్, శ్యామ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, వై. శ్రీనివాస్ రావు, కొండా శ్రీధర్ రెడ్డి, కార్యదర్శులు సీనియర్ టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.