ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అండగా ప్రభుత్వం
క్రీడా శాఖ మంత్రి శ్రీహరి
హైదరాబాద్, మార్చి 2: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. 2026--2027 బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, క్రీడాకారులకు ఆర్ధిక సహాయం, ఇతర వసతులపై డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీ తీసుకు వచ్చి క్రీడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ను ఆటల్లో అగ్రగామిగా నిలిపేందు కు కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఒలంపిక్, పారా ఒలంపిక్, అంతర్జాతీయ, జాతీ య ఆటల పోటీల్లో పతకాలు సాధిందించిన వారికి ఆర్ధిక సహాయం అందించేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండేలా ప్రతిపాదనలు పం పాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆటల్లో ప్రతిభ కనబరుస్తు న్న వారికి ప్రభుత్వం ఆర్ధిక సహా యం చేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సహంతోనే విద్యార్ధి, యువకులు క్రీడల్లో రాణిస్తారని మంత్రి వాకి టి శ్రీహరి వివరించారు. క్రీడాకారులకు ఇచ్చే పారితోషికాలపై విధివిధానాలు రూపొందించాలని, వాటిని నిష్పక్షపాతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




