25-10-2025 12:32:53 AM
నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డ్డి
మునుగోడు, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సన్న వరి ధాన్యానికి అందిస్తున్న బోనస్ 500 రూపాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పి పి సి సెంటర్ కచలాపురం, ఊకొండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.
రైతులు కొనుగోలు కేంద్రాలలో దాన్యం అమ్ముకొవాలని దళారులకు అమ్ముకొని మోసపోవద్దనీ అన్నారు. అకాల వర్షానికి ధాన్యము తడవ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే దాన్యం తేమ శాతం 17 శాతం ఉండే విధంగా తాలు,మట్టి,పెళ్లా లేకుండా శుభ్రంగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వమిచ్చే మద్దతు ధర గ్రేడ్ ఏ 2389 రూపాయలు సాధారణ 2369 రూపాయలు, సన్న వరి ధాన్యానికి 500 రూపాలు బోనస్ అందిస్తుందని ఇట్టి అవకాశాన్ని రైతులు వినియెగించుకోవాలని తెలిపారు. రైతులు నిబంధనలను పాటించి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చేర్మెన్ దోటి నారాయణ, మార్కెట్ డైరెక్ట్ కుంభం చెన్న రెడ్డి హైమదు,
అగ్రికల్చర్ ఏవో పద్మజ, సంఘ డైరెక్టర్లు ఉప్పునుతుల రమేష్, మార్తా మోహన్ రెడ్డి, మేకల మల్లయ్య, సింగం వెంకన్న, జిట్టగోని యాదయ్య, ఏఈఓ నికిల్, సంఘ కార్యదర్శి సుఖేందర్, అశోక్ రెడ్డి, పురుషోత్తం, స్వామీనాధ్ లింగస్వామి, చంద్రశేఖర్ ప్రజా ప్రతినిధులు భీమనపల్లి సైదులు, జాల వెంకటేశ్వర్లు, గురుజా రామచంద్రం, కొండకింది రామ్ రెడ్డి, మేడి యాదయ్య, నడిపల్లి యాదగిరి, మాదగోని దేవలోకం, బీమగోని స్వామి, బీమగోని ముత్యాలు, ముఖ్య నాయకులు రైతులు ఉన్నారు.