calender_icon.png 25 October, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగా 32 గ్రామీణ రహదారులు

25-10-2025 12:32:07 AM

  1. అనమతులు జారీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు
  2. రూ.74.43 కోట్ల నిధులు విడుదల
  3. మంత్రి సీతక్క హర్షం

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్తగా 32 గ్రామీణ రహ దారుల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం  గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వాటి నిర్మాణానికి రూ. 74.43 కోట్ల నిధులు విడుదల చేసింది. కొత్త రాహదారులతో పల్లె ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం కానున్నది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క మాట్లాడు తూ.. గ్రామీణ రహదారులు పల్లె ప్రజల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయని, కొత్త రహదారుల నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా పల్లె ఆర్థిక వ్యవస్థ సైతం బలపడుతుందని పేర్కొన్నారు.

పల్లెల మధ్య అనుసంధానం పెరిగి, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకుతరలించుకోగలుగుతారని ఆకాంక్షించారు. ములుగు వంటి ఆదివాసీ జిల్లాలు ఎంతో పురోగమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.74.43 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాలకు రహదారుల వసతి రావడమే కాదు, అక్కడి జీవన ప్రమాణాలు సైతం పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.