25-10-2025 12:32:59 AM
కొత్తపల్లి, అక్టోబరు 24 (విజయ క్రాంతి): కరీంనగర్ లోని మంకమ్మతోట దగ్గర్వాడి ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 22 న నిర్వహించిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 94 కేజీల విభాగంలో ఎమ్.డి. అయాన్, 60 కేజీల విభాగంలో ఎమ్.డి. సులేమాన్ గోల్ మెడల్ సాధించారు.
నవంబర్లో 7, 8, 9వ తేదీలలో హ నుమకొండలో జరగబోయే రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైనారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి అభినందిస్తూ, పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకొనిరావాలని రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించా రు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్వష్ట శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులుపాల్గొన్నారు.