23-12-2025 09:18:58 PM
నకిరేకల్,(విజయక్రాంతి): రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి మాట్లాడారు.
తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసే జీరో బడ్జెట్ వ్యవసాయం విధానాన్ని రైతులు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. ఆధునిక పద్ధతులతో ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ విధానానికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తున్నదని, రైతులను గుర్తించి అవార్డులు ఇవ్వడం గాంధీ సిద్ధాంతాలకు అనుగుణమని చెప్పారు..ఈవార్షిక వేడుకలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి 70 మంది ఆదర్శ రైతు దంపతులు పాల్గొన్నారు.
తెలంగాణ నుండి జాల ఎల్లయ్య యాదవ్, ఆంధ్రప్రదేశ్ నుండి మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఉత్తమ రైతులకు అవార్డులు అందించారు. వ్యవసాయ రంగానికి సేవ చేసిన శాస్త్రవేత్తలు, వైద్యులు, జర్నలిస్టులు ‘కిసాన్ సేవా అవార్డులు’ ను అందించారు. కార్యక్రమంలో విద్యార్థులచే నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మల్కం క్రీడల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టాయి. నిర్వాహకులు ఎమ్మెల్యే వేముల వీరేశంకు నాగలిని బహుకరించి గౌరవించారు.
ఈ కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, భవాని రెడ్డి, గోపాల్ రెడ్డి, నకిరేకల్ వ్యవసాయ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, ప్రముఖ విద్యావేత్త కందాలపాపిరెడ్డి , గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, గాంధారి ప్రభాకర్ ,పావని, శంభు లింగారెడ్డి, పుచ్చకాయ వెంకటరెడ్డి ,నీరు దయాకర్ రెడ్డి, కే సుభాష్ చంద్ర ,పల్లె శ్రీనివాస్ గౌడ్, యానాల రాధిక పాల్గొన్నారు.