calender_icon.png 5 December, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి ఆత్మహత్యకు ప్రభుత్వాలదే బాధ్యత

05-12-2025 07:18:24 PM

హనుమకొండ,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరా చారి మరణానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని బిసి జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. గతంలో రిజర్వేషన్లు తగ్గిపోవటం, ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్ల హామీ నెరవేరకపోగా బీసీ రిజర్వేషన్లు మరింత తగ్గిపోవడంతో బలహీన వర్గాలలో ముఖ్యంగా యువత కొంతమంది ఆందోళన చెందుతున్నదనే విషయం సాయి ఆత్మహత్యతో రుజువైందని అన్నారు.

ఒక్క రిజర్వేషన్ల విషయమే కాదు, బీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుతో బలహీన వర్గాలు ఆందోళన చెందుతున్నాయని,తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ రాదనే ఆందోళనతో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న సంఘటనలు మరువకముందే సాయి ఆత్మహత్య సంఘటన జరగటం బాధాకరం అన్నారు.బలహీనవర్గాలు తమ వెనుకబాటు తనంపై ప్రభుత్వాలపై ప్రజాస్వామిక పోరాటాలకు సిద్ధం కావాలి కానీ ఆత్మహత్యలు లాంటి చర్యలకు పాల్పడవద్దని,బలహీన వర్గాలకి అవకాశాలు కల్పించే విషయంలో ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోవాలని డాక్టర్ శేషు డిమాండ్ చేశారు.