calender_icon.png 5 December, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశీర్వదించండి… అవకాశం ఇవ్వండి

05-12-2025 07:23:01 PM

చందుపట్ల సర్పంచ్‌గా సేవకు సిద్ధమైన కాంగ్రెస్ అభ్యర్థి దిగోజు లత వెంకటాచారి

నకిరేకల్,(విజయక్రాంతి): “ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి… గెలిపిస్తే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా” అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, సీపీఎం బలపరిచిన దిగోజు లత వెంకటాచారి అన్నారు. శుక్రవారం చందుపట్ల గ్రామంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ“మీరు నా తోబుట్టువులు… మీరే నా బలం. మీ నమ్మకంతోనే సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. సేవ చేయడం కోసం ఈ పోరులో నిలబడ్డాను” అని పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆమె తెలిపారు. “ఒక పదవిధారిగా కాదు… ఈ గ్రామానికి సేవకుడిలా పనిచేస్తాను. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభించే వరకు కృషి చేస్తానని వెల్లడించారు. అవకాశమిస్తే చందుపట్లను అభివృద్ధి పథంలో నడిపిస్తాను” అని స్పష్టంచేశారు. జరుగబోయే ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి, భారీ మెజారిటీతో గెలిపించి సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆమె గ్రామ ప్రజలను కోరారు.