calender_icon.png 5 December, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న ఫోన్ల అందజేత

05-12-2025 07:15:53 PM

సిద్దిపేట క్రైం: పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి బాధితులకు అందజేశామని సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నెల రోజుల క్రితం వికాస్ కుమార్, దాసరి కర్ణాకర్, అజారుద్దీన్, యాస్మిన్ తమ ఫోన్లు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా పోయిన ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకొని, వాటి యజమానులకు శుక్రవారం అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ వాసుదేవరావు చెప్పారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా లేదా గుర్తుతెలియని వ్యక్తులు  ఎత్తుకొని పోయినా బాధితులు సీఈఐఆర్ పోర్టల్ లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తద్వారా  కోల్పోయిన ఫోన్ ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనవద్దని సూచించారు.