05-12-2025 07:47:27 PM
జిల్లా పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అబుతాలిబ్
కుమ్రంభీం ఆసిఫాబాద్/జైనూర్(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు విద్య పరంగా ఆదుకునేందుకు మరింత మంది సామాజిక సేవకులు ముందుకు రావాలని మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అబుతాలిబ్ సూచించారు. శుక్రవారం జైనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో సామాజిక కార్యకర్త ఖాజా ఖలీల్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉర్దూ పాఠశాల ఉన్నతికరణ విషయంలో ఖాజా ఖలీల్ చాలా కృషి చేశారని కొని ఆడారు. వెనుకబడిన ఆసిఫాబాద్ జిల్లాలో విద్యాపరంగా సేవలు అందించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద ఫాజిల్ బియబాని, సన్ రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జమీల్, మాజీ ఎంపీటీసీ అజు లాలా, మాజీ ఉపసర్పంచ్ షేక్ అబ్బు, మైనారిటీ నాయకులు షేక్ ఇక్బాల్, మౌలాన దస్తగిర్,హాఫిజ్ మునీర్ అహ్మద్, మొహసీన్ ఖాన్, పాఠశాల ప్రిన్సిపాల్ ఆయేషా, ఉపాధ్యాయులు నాజిమ, సోము, పాఠశాల చైర్మన్ సత్తార్, తదితరులున్నారు.