calender_icon.png 17 January, 2026 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలం

17-01-2026 07:23:33 PM

సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి బండారి అవిలయ్య 

నూతనకల్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్ విమర్శించారు. మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పీడీఎస్యు పీవైఎల్  గ్రామ కమిటీల ఆధ్వర్యంలో అమరుల స్మారకార్థం గ్రామీణ క్రీడలు నిర్వహించారు.

ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు శనివారం బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. పార్టీ గ్రామ కార్యదర్శి దగ్గుల మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథులుగా ఐలయ్య, డేవిడ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... క్రీడారంగంలో కులం, మతం, డబ్బు, రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఆశించిన స్థాయిలో స్వర్ణ పతకాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోని 'మట్టిలో మాణిక్యాలను' వెలికితీయడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించామన్నారు. నేటి యువత డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణ అలవరుచుకోవాలని సూచించారు.భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, జార్జ్ రెడ్డి, జంపాల, కోలా శంకర్, రంగవల్లి, కుమారస్వామిల ఆశయాలతో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలుగా యువత ఎదగాలని వారు పిలుపునిచ్చారు.