1 July, 2026 | 1:06 PM

సినారె సేవలు అజరామరం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

12-06-2024 03:49 PM

రాజన్న సిరిసిల్ల : ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి సేవలు అజరామరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. సినారె వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సినారె స్మృతి స్థలిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ...  తెలుగు సాహిత్య రంగానికి సినారె చేసిన సేవలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. కార్యక్రమంలో సినారె కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.