ప్రభుత్వ టీచర్ దారుణ హత్య
12-06-2024 05:55 PM
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య గురైన ఘటన కలకలం రేపుతుంది. పాఠశాల పున:ప్రారంభం సందర్భంగా బుధవారం విధులకు హాజరయ్యేందుకు నార్నూరు మండలంలోని తన స్వగ్రామం నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో లోకారి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు టీచర్ పై దాడి చేసి హతమార్చారు. దీంతో టీచర్ విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.






