02-08-2025 12:24:46 AM
పీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్
ఆలేరు, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఆలేరు స్థానిక అతిధి గృహంలో శుక్రవారం రోజున గౌడ కులస్తుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా పిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆలేరు మండలం లోని అన్ని గ్రామాల గౌడ సంఘం కులస్తులు శుక్రవారం పీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ కు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముందుగా టీపీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే గౌడ కులస్తులకు తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు గీత వృత్తి ఆధారపడి జీవిస్తున్నటువంటి పదిలక్షల కార్మికులకు గీతా కార్మికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ గౌడ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన అన్నారు.
కాటమయ్య రక్షణ కిట్లు గ్రామాలలో అందక గీతా కార్మికులు సేఫ్టీ మొకులు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాల గురవుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అండగా ఉండి అన్ని గ్రామాలకు రక్షణ కిట్లు అందేటట్లు నా వంతు నేను కృషి చేస్తాను. మరణించిన గౌడ కుటుంబాలకు అన్ని విధాలా బీమా సౌకర్యము రావడానికి కృషి చేస్తాను.
ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం మాజీ రాష్ట్ర నాయకులు మోరిగాడి చంద్రశేఖర్ మాట్లాడుతూ పల్లె శ్రీనివాస్ గౌడ్ కి రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి రావడం మా గౌడ కులస్తులందరికీ హర్షణయం. గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం కోసం ముందుగా నిలబడి అందరికీ సహాయ సహకారాలు అందించాలని అలాగే గత ప్రభుత్వాలు గీత కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు.
అందులో మద్యం దుకాణాలలో 15% రిజర్వేషన్ కల్పించిన గాని అది అమలు కావడం లేదని వెంటనే మద్యం దుకాణంలో గౌడ కులస్తులకు 15% నుంచి 20% పెంచాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ కార్యక్రమం లో సుధాగాని సత్యరాజ్, దూడల రమేష్, వైస్ ఎంపీపీ కిష్టయ్య, నామిలే రాజయ్య, లక్ష్మీనారాయణ, పల్లె నర్సింలు, దూడల రాజయ్య, పోతుగంటి సంపత్ కుమార్, కృష్ణమూర్తి గౌడ్, మైసగౌడ్, మిట్టపల్లి విజయ్ కుమార్, మురళి మిట్టపల్లి వీరస్వామి, బైరి విశ్వనాథం, మొరిగాడి లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.