calender_icon.png 3 August, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేయూత పెన్షన్‌దారుల సభను జయప్రదం చేయండి

02-08-2025 12:22:03 AM

ఆలేరు, ఆగస్టు 1 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ఎమ్మార్పీయస్ సీనియర్ నాయకులు కందుల నర్సింగ్ రావ్ మాదిగ ఆధ్వర్యంలో చేయూత పెన్షన్ దారుల గ్రామ చైతన్య సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ హాజరై మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారి నేత్రుత్వంలో 2007  నుండి మనవీయ కోణంలో పెన్షన్ పెంపు కోసం ఉద్యమాలు నిర్మించి ఫలితాలు.

రాబట్టడం జరిగిందని దశల వారీగా వి ఎచ్ పి యస్ ఎమ్మార్పియస్ చేసిన పోరాటాల తోనే పాలక వర్గాలు పెన్షన్ లు పెంచడం జరిగిందని ఆగస్టు 13 న హైదరాబాద్‌లోని ఎల్ బీ స్టేడియంలో చేయూత పెన్షన్ దారుల గర్జన వి ఎచ్ పి యస్, ఎమ్మార్పియస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని పెన్షన్ లు పెంపు కోసం చేయూత పెన్షన్ దారులు గ్రామ గ్రామాన స్వచ్చందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఎమ్మార్పియస్ నాయకులు కందుల స్వామి మాదిగ, వికలాంగుల, వృద్దాప్య, వితంతువులు, ఒంటరి మహిళల, గీత కార్మిక, చేనేత కార్మిక, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి నాయకులు ఎడ్ల ప్రతాప్ రెడ్డి, పల్లపు ఉమ, లోడి అండమ్మ, నోముల లక్ష్మీ నర్సయ్య గౌడ్, దాచ భిక్షపతి పద్మ శాలి, కందుల యాదగిరి, కోరుటూరి లక్ష్మీ నర్సమ్మ, మల్లమ్మ, పడ్తం పోషయ్య, దంతురి అంజమ్మ, తూర్పటి ఎల్లయ్య, తూర్పటి అగ్గి రామయ్య, కందుల అబ్బ సాయిలు, తూర్పటి రేణుక, తూర్పటి రాజేశ్వరి, నర్సమ్మ, కందుల యాదగిరి, కందుల పెద్ద చంద్రయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.