ఎల్కూర్‌లో జీపీడీపీ గ్రామసభ
14-08-2026 12:00 AM
మల్దకల్, ఆగస్టు 13: ఎల్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పి.వినోద్కుమార్ అధ్యక్షతన గురువారం జీపీడీపీ గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి ప్రణాళిక, పారిశుధ్యం, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతులపై చర్చించి తీర్మానాలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు పనిచేయాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుభావతి, వార్డు సభ్యులు, అధికారులు, అంగన్వాడీ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






