గణప సముద్రం భూసేకరణపై కొలిక్కి వచ్చిన చర్చలు
వనపర్తి, ఆగస్టు 13 (విజయక్రాంతి): గణప సముద్రం రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి బుద్ధారం, ఘనపూర్ నిర్వాసిత రైతులతో పరిహారంపై చర్చించారు.
రైతులు ఎకరాకు రూ.15 లక్షలు కోరగా, రూ.14 లక్షలు పరిహారం అందించేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. బండ్ ఎత్తు పెంచడం ద్వారా భూసేకరణ తగ్గించే అవకాశాలపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇల్లు లేని పేద నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చర్చలు సానుకూలంగా సాగడంతో భూసేకరణ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైందని ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు.






