calender_icon.png 6 September, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ వెళ్లిన జీపీఓలు

06-09-2025 12:00:00 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులు (జీపీఓ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోవడానికి హైదరాబాద్ తరలి వెళ్లారు. జిల్లాలో 1080 క్లస్టర్లు ఉండగా 151 మంది వీఆర్‌ఏ, వీఆర్వోలు అర్హత పరీక్ష రాసి ఎంపికయ్యారు. అలాగే ఇతర జిల్లాల నుంచి 12 మంది మహబూబాబాద్ జిల్లాకు కేటాయించారు.

మొత్తం 163 మందిని నియామక పత్రాలను పొందడానికి శుక్రవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మూడు ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ పంపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, కలెక్టరేట్ ఏవో మదన్ గోపాల్, రాఘవరెడ్డి, సునీల్ కుమార్, ఖయ్యూం పాల్గొన్నారు.