calender_icon.png 12 October, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపయోగంగా ధాన్యం పట్టే యంత్రం

12-10-2025 04:45:52 PM

యంత్రం ఉపయోగిస్తే రైతుకు జేబుకు చిల్లే?

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన తాలు, మట్టిని వేరు చేసే యంత్రం నిరుపయోగంగా ఉత్సవ విగ్రహంగా మారింది. రైతులు తమ వరి పంటలను మిషన్ల ద్వారా కోయించి నేరుగా మార్కెట్ కు తరలిస్తుండడంతో ధాన్యంలో తాలు, మట్టి వంటివి ఉండిపోతున్నాయి. అయితే వాటిని వేరు చేసేందుకై మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన యంత్రం రైతులు ఉపయోగించుకోవాలంటే ఎకరానికి దాదాపు 5 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని దీంతో తమ జేబుకు చిల్లు పడడం తప్పదని రైతులు యంత్రాన్ని ఉపయోగించడం లేదు. దీంతో ధాన్యం పట్టే యంత్రం కవర్లతో కప్పి నిరుపయోగంగా దర్శనమిస్తుంది. అనాలోచిత నిర్ణయాలతో లక్షల రూపాయలు పెట్టి వీటిని కొనుగోలు చేసే బదులు మరిన్ని కాంటాలు పెంచి ధాన్యం కొనుగోలు వేగం అయ్యేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.