25-04-2025 02:21:46 AM
కలెక్టర్ ఎం హనుమంతరావు
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 24 ( విజయా క్రాంతి ): మోత్కూరు మండలంలోని పాటిమాట్ల గ్రామంలో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంను గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా సందర్శించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తేవాలన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా మాయిశ్చర్ మీటర్ ద్వారా పరిశీలించారు.
రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్ల నిర్వహణ ను సజావుగా నిర్వహిస్తున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం అయినందున రైతులకు నీడ కోసం టెంట్ వేయించి, త్రాగునీరు ఏర్పాటు చేసి, వడదెబ్బ తగలకుండా ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్ లను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి తేవాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం వివరాలను సిబ్బంది రికార్డులలో నమోదు చేస్తూ తేమశాతం వచ్చే వరకు రోజువారీగా రైతుకు తెలియ పరచాలన్నారు. రైతును అప్రమత్త పరుస్తూ ఎప్పటికప్పుడు తేమశతాన్ని పరిశీలిస్తూ తేమ శాతం రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రిజిస్టర్ లో నమోదు చేసి ట్యాబ్ ఎంట్రీలు చేయాలన్నారు. కలెక్టరు వెంట ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.