29-04-2025 08:02:09 PM
పొన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..
హర్షం వ్యక్తం చేసిన రైతులు...
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతుల ఇబ్బందులను 'ధాన్యం కొనుగోలు కేంద్రం లేక అన్నదాతల ఆందోళన' పేరిట విజయక్రాంతి వెబ్ ఎడిషన్ లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు మంగళవారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ చెన్నూరు ఏడిఎ బానోత్ ప్రసాద్(Chennur ADA Banoth Prasad) ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని తరలించి మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ముత్యం తిరుపతి, ఏవో కనకయ్య, కో-ఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ నరేష్, పిపిసి సెంటర్ ఇన్చార్జ్ మల్లేష్, గ్రామ రైతులు పెంచాల మధు, చిందం మల్లేష్,పెంచాల అంజన్న, కోట్ల రాజయ్య, తోట నారాయణ, పెంచాల రంజిత్, జాడి చంద్రయ్య, జాడి మల్లక్క, పెంచాల రాజన్నలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ యువ రైతులు పెంచాల మధు, పెంచాల రంజిత్ లను గ్రామస్థులు అభినందించారు. అలాగే రైతుల ఇబ్బందులను పత్రికా కథనం ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కీలకం అయిన విజయక్రాంతి పత్రికకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.