01-05-2025 12:25:08 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం కృషి చేయాలని ఎమ్మె ల్యే కోవ లక్ష్మీ అన్నారు. బుధవారం మండలంలోని గుండి గ్రామంలో ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మాజీ జెడ్పీటీసీ అరిగేల నాగేశ్వర్ రావులతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రత్నా అంబేద్కర్ చూపిన అడుగుజాడలలో నడవాలని యువకులు మహనీయులను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంత రం భీం సైనిక్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్ అలి బిన్ అహ్మద్, మాజీ సర్పంచ్ జబరి అరుణ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు జాబరి రవీందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.