01-05-2025 01:54:45 AM
కామారెడ్డి, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి), పాఠశాల ప్రారంభం నుంచి పదవ తరగతి ఫలితాల్లో లయోల పాఠశాల విద్యార్థులు విజయ దుందుభి మో గీస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చారి తెలిపారు.
బుధవారం 10వ తరగతి ఫలితాలు ప్రకటించగా పాఠశాలకు చెందిన103 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా 71 మంది విద్యార్థులు 500 మార్కు లు పైగా సాధించారు. 450 మార్కులకు పైగా 23 మంది విద్యార్థులు సాధించారు. 400 మార్కులు 9 మంది విద్యార్థులు లు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయు లు వీరచారి తెలిపారు.
పాఠశాల 2008లో ప్రారంభించిన నుంచి 100% ఫలితాలు పదో తరగతిలో వస్తున్నట్లు తెలిపారు. 2025 ఫలితాల్లో పాఠశాల కు చెంది న ప్రణీ త రెడ్డి 570 మార్కులు, హర్ష వర్ధన్ 567, హృదయ దిలీష్ 566, అనుప్ కుమార్ 566, కృతిక్564, అక్షర 563, శ్రీ మై 562, రిషిక్ 560, మార్కులు సాధించి విజయ దుందుభి మోగించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరాచారి తెలిపారు. ఈ సం దర్భంగా విద్యార్థులను అభినందించారు.