28-10-2025 12:39:57 AM
మరో మైలురాయిని అందుకున్న గుంటూరు జిల్లా వడ్లమూడిలోని యూనివర్సిటీ
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ మరో మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలకు జాతీ య స్థాయిలో నాణ్యత ప్రమాణాలను నిర్ధారించే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీ ఏ) నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీలో అర్హత కలిగిన అన్ని ప్రోగ్రామ్స్‌కు టైర్1 అక్రిడిటేషన్ లభించింది.
ఈ విజయాన్ని పురస్క రించుకుని యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ కల్నల్ ప్రొఫెసర్ పీ నాగభూషణ్ మాట్లాడుతూ.. విజ్ఞాన్ యూనివర్సిటీ మొదటి నుం చి విద్యా నాణ్యత, పరిశోధనలో ప్రతిభ, సా మాజిక బాధ్యత ఈ మూడు అంశాలను సమన్వయం చేస్తూ ముందు కు సాగుతోందన్నారు. ఎన్బీఏ టైర్1 అక్రిడిటేష న్ పొందడం ద్వారా విజ్ఞాన్ విద్యా ప్రమాణాలకు, బోధ నా నాణ్యతకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు.
ఇది మా విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకుల సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. విజ్ఞాన్ వి ద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లా డుతూ.. విజ్ఞాన్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. టైర్1 అక్రిడిటేషన్ సా ధించడంలో కృషి చేసిన ఐక్యూఏసీ సిబ్బందిని లావు రత్తయ్య, సీఈవో డాక్టర్ మేఘనా కూరపాటి, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎం వీ రావు, ఆయా విభాగాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు అభినందించారు.