22-05-2025 04:44:52 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో యాసంగిలో రైతులు సాగుచేసిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే కొనుగోలు చేయకుండా ప్రభుత్వ అధికారులు ఆలస్యం చేయడం వల్లనే వరి ధాన్యం తడిసిపోయిందని టిఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గురువారం నిర్మల్ టౌన్ నిర్మల్ రూరర్ దిల్వార్పూర్ మండలంలో తడిసిన ధాన్యాన్ని టిఆర్ఎస్ నేతలు డాక్టర్ సుభాష్ రావు పట్టణ కన్వీనర్ మార్గుండ రాము ఆధ్వర్యంలో పరిశీలించి రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏవో సూర్య రావుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చారి జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.