22-05-2025 04:41:49 PM
నిర్మల్ (విజయక్రాంతి): వర్షాల వల్ల తడిసిపోయిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి రెడ్డిలు తెలిపారు. గురువారం నిర్మల్ మండలంలోని ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. వెంటనే అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిసిపోయిందని వెంటనే తూకం వేసి రైస్ మిల్లర్లకు తరలించాలని కోరారు. అవసరాన్ని బట్టి మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసి వెనువెంటనే దాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో ఏడీఏ విద్యాసాగర్, ఏవో వసంత్ రావు తదితరులున్నారు.