calender_icon.png 23 May, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవం..

22-05-2025 08:52:23 PM

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

హనుమకొండ (విజయక్రాంతి): ఉత్తర, దక్షిణ భారతానికి ముఖద్వారంగా, రాష్ట్రంలో రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్‌ అయిన కాజీపేట జంక్షన్‌ ను రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య(MP Kadiyam Kavya) అన్నారు. గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవ కార్యమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి కె ఆర్ నాగరాజు, యశస్విని రెడ్డిలతో కలసి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య హాజరైన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ... ఈ రోజు వరంగల్ ప్రజలకు ఒక శుభదినం అన్నారు. కాకతీయ చారిత్రాత్మక కళ ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఇది నిత్యం ఇక్కడ రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనతో పాటు, ఆహ్లాదాన్ని పంచుతుందన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రధానంగా ఎస్కలేటర్లు, విశాలమైన పాద చారుల వంతెన, కళాత్మక శిల్పాలు, విశాలమైన ప్రాంగణం ఇతర వసతులు కల్పించడం జరిగిందన్నారు. 

అమృత్ భారత్ రైల్వేస్టేషన్ అభివృద్ధిలో భాగంగా కాజీపేట రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం 40 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి అన్నారు. త్వరితగతిన పనులు పూర్తచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావలన్నారు. కాజీపేటను మల్టీ మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. ఫాతీమ ఆర్ఓబి, కాజీపేట బస్టాండ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, రైల్వే అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.