calender_icon.png 23 May, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న శాసనమండలి సభ్యులు మధుసూదనాచారి

22-05-2025 08:28:18 PM

భద్రాచలం (విజయక్రాంతి): హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దర్శనానికి తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ ప్రస్తుత శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనా చారి(Legislative Council Members Sirikonda Madhusudhana Chary), టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి విచ్చేసి రాముల వారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి మూలవిరాట్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మాని రామకృష్ణ మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కోటగిరి ప్రమోద్ కుమార్ కొల్లం జయ ప్రేమ కుమార సోషల్ మీడియా అధ్యక్షులు ఇమంది నాగేశ్వరరావు, రామోజు రాముడు, తదితరులు ఉన్నారు.