calender_icon.png 23 May, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముగిసిన హనుమాన్ మాలధారణ ఉత్సవాలు

22-05-2025 08:39:46 PM

సిద్దిపేట (విజయక్రాంతి): హనుమాన్ మాలధారణ ఉత్సవాల సందర్భంగా సిద్దిపేటలోని గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అక్షయ తృతీయ నుండి హనుమాన్ జయంతి వరకు 23 రోజులు హనుమాన్ మాలధారణ స్వాములకు భిక్ష(అన్నదాన) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతిరోజు సుమారు వెయ్యి మంది స్వాములు అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఒకరోజు హనుమాన్ వ్రతం, నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది.

హనుమాన్ జయంతి పురస్కరించుకొని గురువారం స్వామివారికి ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకం విశేష అలంకారం హనుమత్ మూలమంత్ర హవనం నిర్వహించారు. 24 గంటలు హనుమాన్ చాలీసా పారాయణం, అఖండముగా అనేకమంది స్వాములు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో ట్రస్ట్ అధ్యక్షులు వీరబత్తిని సత్యనారాయణ, మహంకాళి చంద్రమౌళి, ముక్క లక్ష్మీపతి, పిండి అరవింద్, స్వాములు మహిళలు పాల్గొన్నారు.