calender_icon.png 23 May, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హనుమాన్ జయంతి..

22-05-2025 08:45:12 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి(Hanuman Jayanti) వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు భక్తి ప్రవృత్తులతో ఆంజనేయ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి గ్రామాల్లో సైతం హనుమాన్ జయంతి సందర్భంగా ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. కాషాయ పతాకాలతో పట్టణాలు, పల్లెలు కాషాయ వర్ణంగా మారిపోయాయి. జై హనుమాన్.. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోయాయి. ఉత్సవ విగ్రహాలకు అడుగడుగునా మహిళలు నీరాజనం పలికారు. కోలాటాలు, డీజే పాటలతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది.