22-05-2025 08:20:53 PM
ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌలి..
హనుమకొండ (విజయక్రాంతి): పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల(స్వయం ప్రతిపత్తి) లో దోస్త్ వాలంటరీ హెల్ప్ లైన్ సెంటర్(Dost Voluntary Helpline Centres)ను కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్ట్ నెన్ట్ ఫ్రొఫెసర్ బి.చంద్రమౌళి ప్రారంభించారు. ఈ దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ 2025-26 విద్యా సంవత్సరంలో ముఖ్యంగా అమ్మాయిలకు డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి, ఎదురయ్యే టెక్నికల్, ఇతర సమస్యలను తొలగించడానికి ప్రధానంగా ఈ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేయడం, విద్యార్థినులు తమ ఇంటర్ హాల్ టికెట్ వివరాలు తెలుసుకోవడం, ఇంటర్ బోర్డు కాకుండా ఇతర విద్యా సంస్థలలో చదివిన విద్యార్ధినుల అప్లికేషన్ లు స్వీకరించడము, రెడ్ చానెల్ స్టూడెంట్ వెరిఫికేషన్ చేయడం, ఆధార్ లోని తప్పులు, క్యాస్ట్ మిస్ మాచ్ మొదలగునవి కళాశాలలోని హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా పరిష్కరించబడుతాయి.
కళాశాలలోని హెల్ప్ లైన్ సెంటర్ విద్యార్థినులకు ఎంతో ఉపయోగ పడుతుందని, ఈ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా వడ్డేపల్లి, హనుమకొండ, కాజీపేట, వరంగల్ ఇతర పరిసర ప్రాంతాల విద్యార్థినులు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల దోస్త్ కో ఆర్డినేటర్ డా.డి. సురేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ డా.జి. సుహాసిని, అధ్యాపకులు డా.కె. శ్రీనివాస్, డా.జి. రాజిరెడ్డి, బి. స్వర్ణలత, టి. అరుణ, ఎం.డి.రఫీ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.