calender_icon.png 23 May, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంతో ఒకరు మృతి

22-05-2025 08:56:09 PM

బచ్చన్నపేట (విజయక్రాంతి): విద్యుత్ ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన బచ్చన్నపేట మండల(Bachannapet Mandal) కేంద్రంలోని గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఎండి జమాల్ ఇంట్లో శుభకార్యానికి వచ్చి బంధువుడైన ముషీరాబాద్ హైదరాబాద్ పట్టణానికి చెందిన దావత్అలీ ఆలియాబేగం నలుగురు సంతానం కాగా మూడో కుమారుడైన ఎండి అసాద్(15) జమాల్ ఇంటి పైన వాటర్ ట్యాంకులో స్థానానికి నీళ్లు రాకపోవడంతో ఇంటిపైన చూడడానికి వెళ్లి అసాద్ ప్రమాదవశాత్తు 11 కెవి విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

సంఘటన స్థలానికి స్థానిక ఎస్సై ఎస్.కె హమీద్ చేరుకొని కరెంటు నిలిపి వేయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 11 కెవి విద్యుత్తు లైను ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ అధికారులకు ప్రజా ప్రతినిధులకు గోపాల్ నగర్ గ్రామ ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాధుడు లేకపోయాడు.

గత ప్రభుత్వంలో ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నేడు ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకోగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విద్యుత్తు లైను తొలగించాలి అంటే మూడు లక్షల పై చిలుకు ఖర్చు అవుతుందని గతంలో స్టేట్మెంట్ విద్యుత్ అధికారులు ఇచ్చారు. అంత డబ్బులను ఇచ్చుకునే పరిస్థితిలో కాలనీవాసులు లేరు అంత డబ్బు కట్టలేక కరెంటుతో భయపడుతూ జీవనం కొనసాగిస్తున్నా ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఇట్టి ప్రమాదకరమైన విద్యుత్తు లైను ఇక్కడి నుంచి తొలగించాలని గోపాల్ నగర్ గ్రామ ప్రజలు కోరారు.