calender_icon.png 22 May, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

22-05-2025 04:47:32 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం శ్రీ భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) పోలీసు అధికారులు భాగ్యరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... భాగ్యరెడ్డి వర్మ జీవితం, ఆయన ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన చూపిన దారిలో నడిచి, సమాజ సేవలో భాగస్వాములవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏ.ఓ యూనిస్ అలీ, ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, సమ్మయ్య, ఆర్.ఐ లు రాం నిరంజన్ రావు, రమేష్, ఆర్.ఎస్ఐ లు రవి కుమార్, రాజ శేఖర్, సాయి కృష్ణ, ఏం.రవి, పోలీస్ సిబ్బంది మరియు డి.పి.ఒ సిబ్బంది పాల్గొన్నారు.