11 April, 2026 | 9:56 PM

Breaking News

బూతు స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం   •   కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి   •   మునుగోడులో ఘనంగా రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   13 నుంచి అరైవ్ - అలైవ్... ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యo కావాలి   •   సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పూలే   •   మద్యం శాఖకు ఉన్న మంత్రి విద్యాశాఖకు ఎందుకు లేడు?   •   చిన్న‌చెల్మెడలో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం   •   తిప్పారం సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం   •   నో హెల్మెట్ నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ నో ఫ్యూయల్   •   సిద్దిపేటలో మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రం ప్రారంభం   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జాప్యం చేయొద్దు..

13-11-2025 05:30 PM

- నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యాలి

- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

మునుగోడు (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జాప్యం చెయ్యకుండా నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం మునుగోడు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు పరిశీలించి మాట్లాడారు.17 శాతం తేమతో, తాలు ,తరుగు లేకుండా,నాణ్యత ప్రమాణలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, జాప్యం చేయొద్దని, వర్షం కూడా లేనందున తేమను పరిశీలించి రైతులకు మేలు జరిగే విధంగా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

పి పి సిసెంటర్లో రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగినారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఇబ్బంది లేవని చెప్పారు. పత్తి  రైతులు 12 శాతం వరకు తేమ వచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలని అప్పుడు పత్తి కొనుగోలు లో రైతులకు ఎలాంటి  ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేష్, జిల్లా సహకార అధికారి పత్య నాయక్, ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ నరేష్, సెక్రెటరీ సుఖేందర్ ఉన్నారు.