13-11-2025 05:26:54 PM
లోక్ ఆదాలాత్ ను వినియోగించుకోండి..
శాలిగౌరారం ఎస్ ఐ డి. సైదులు..
నకిరేకల్ (విజయక్రాంతి): వివిధ కేసుల్లో రాజీమార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా సమన్యాయం సత్వర పరిష్కారం జరుగుతుందని శాలిగౌరారం ఎస్ఐ డి. సైదులు అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 15న నకిరేకల్ కోర్ట్ నందు నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీ మార్గమే రాజ మార్గమని అన్నారు. రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనని తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులో క్రిమినల్, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులలో కక్షిదారులు రాజీపడాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.