calender_icon.png 23 September, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో గ్రామపంచాయతీ కార్మికుడు మృతి

23-09-2025 06:43:26 PM

తిమ్మాపూర్,(విజయక్రాంతి): తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో గుండెపోటుతో గ్రామపంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం పోరండ్ల లో సఫాయిగా పనిచేస్తున్న కిన్నెర దుర్గయ్య (58) మంగళవారం ఉదయం గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేశాడు. ఒకసారిగా చాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ కి తెలిపి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో నీళ్లు తాగి కూర్చున్న ఆయన కుప్పకూలిపోయాడు.

ఆర్ఎంపి వెళ్లి చూడగా స్పందించకపోవడంతో సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది. పదేళ్లుగా గ్రామపంచాయతీలో సపాయిగా పనిచేస్తున్న దుర్గయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. దుర్గయ్య కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. దుర్గయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా దుర్గయ్య నేత్రాలను దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.