calender_icon.png 23 September, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల మరమ్మత్తులకై ఈనెల 26న ఆర్ & బి కార్యాలయం ముట్టడి

23-09-2025 06:40:29 PM

సిపిఎం..

నకిరేకల్ (విజయక్రాంతి): రామన్నపేట మండల వ్యాప్తంగా అద్వానంగా ఉన్న ఆర్ & బి రోడ్లను వెంటనే మరమ్మత్తు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ఆర్ & బి కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో బలుగూరి అంజయ్య అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామన్నపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసమై గుంతల మయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నవి. ప్రయాణాలు నరకయాతనంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో గత ఆరు నెలల నుండి దశలవారీగా అనేక ఉద్యమాలు నిర్వహించిన ప్రజల స్వచ్ఛందంగా వచ్చి నిరసనలు తెలిపిన ప్రభుత్వ యంత్రాంగంలో చలనం మాత్రం లేదన్నారు.

ఎక్కడ కూడా తట్టడు మట్టి పోసిన గుంటలు పూసిన దాఖలాలు లేవన్నారు. రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ముట్టడికి మండల వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నర్సింహా చారి, బోయిని ఆనంద్, కందుల హనుమంతు, జంపాల అండాలు, మండల కమిటి సభ్యులు గన్నేబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, ఆవనగంటి నగేష్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు గంటెపాక శివ కుమార్, బోడిగే రజిత, శాఖ కార్యదర్శులు తాళ్లపల్లి జితేందర్, మునికుంట్ల లెనిన్, కునూరు మల్లేశం, శానగొండ వెంకటేశ్వర్లు, గుండాల ప్రసాద్, పావిరాల మత్యగిరి, గంగదేవి అంజయ్య, జోగుల ధనలక్ష్మి, కన్నెబోయిన యాదయ్య, కొమ్ము అంజమ్మ, శానాగొండ రాము, పుట్టల ఉదయ్ కుమార్, అప్పం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.