04-11-2025 08:55:20 PM
మల్యాల (విజయక్రాంతి): మల్యాల మండలంలోని ‘మోదీ కానుక’గా అందిస్తున్న సైకిళ్లని రామన్నపేట, పోతారంలోని విద్యార్థులకు మంగళవారం ఎంఈవో జయసింహ రావు, బిజెపి మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్యాల బిజెపి మండల అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకునే విద్యార్ధినీ, విద్యార్థులకు మోడీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినోత్సవం సందర్భంగా సైకిళ్ల పంపణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు 20 వేల సైకిళ్లు దశలవారీగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రామన్నపేటలో 35, పోతారంలో 18 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొల్లూరు గంగాధర్, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, బొట్ల ప్రసాద్, గడ్డం నడిపి మల్లేశం, కిల్లేటి రమేష్, బొమ్మన పరమేష్, తిరుపతి, వకలభరణం మౌర్య, చిగుర్ల మల్లేశం, నాగరాజ్, గడ్డం గంగయ్య, నక్కా ఆనందం, బండారి రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.