04-11-2025 08:53:13 PM
వరంగల్ ఆర్జెడి గోపాల్..
హనుమకొండ (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఇంటర్మీడియట్ ఆర్జెడి ఏ.గోపాల్ అన్నారు. వైబ్రెంట్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం కె.ఎల్. ఫంక్షన్ హాల్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరము విద్యార్థిని, విద్యార్థులకు వైబ్రేంజ్-25 అనే పేరుతో పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హనుమకొండ డిఐఈఓ,(ఇన్చార్జి ఆర్జెడి) గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థాపించిన రెండు సంవత్సరాలలోనే దాదాపుగా 900 మంది విద్యార్థిని, విద్యార్థులకు కోటా రాజస్థాన్ ఫ్యాకల్టీతో పాటు, నాణ్యమైన కోటా స్టడీ మెటీరియల్, ఐఐటి- జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఐపిఈ. మార్చి 2025లో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శేషు కుమార్, సిటీ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అమర జ్యోతి,ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి హిమాన్షి కాట్రగడ్డ, యోగా మాస్టర్ శ్రీనివాస్, ప్రముఖ గాయని శిరీష, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.