calender_icon.png 5 November, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచారం ప్రసాద్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

04-11-2025 09:38:00 PM

'కెరోటిడ్ వెబ్' స్టెంటింగ్ చికిత్సతో 62 ఏళ్ల రోగికి కొత్త జీవితం..

ఉప్పల్ (విజయక్రాంతి): నాచారం ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి 62 ఏళ్ళ వృద్ధుడికి నూతన జీవితం అందించారు. ప్రసాద్ ఆసుపత్రి కార్డియాలజీ నిపుణులు కేరోటెడ్ వెబ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అరుదైన, అత్యంత ప్రమాదకరమైన ధమని సంబంధిత వ్యాధి 'కెరోటిడ్ వెబ్'తో బాధపడుతున్న 62 ఏళ్ల వ్యక్తికి క్లిష్టమైన కెరోటిడ్ వెబ్ స్టెంటింగ్ విధానాన్ని ప్రసాద్ ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా పూర్తి  చేశారు.ఈ కెరోటిడ్ వెబ్ అనేది మెడలోని ప్రధాన రక్తనాళంలో ఏర్పడే అసాధారణ గడ్డలాంటి నిర్మాణమని ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుని రక్తం గడ్డకట్టేలా చేస్తుందని ఫలితంగా పదే పదే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు.

దీనికి చికిత్సను ఆలస్యం చేస్తే జీవితం ప్రమాదంలో పడుతుంని అన్నారు.బెంగళూరుకు చెందిన గౌతమ్ రామకృష్ణ గత జూన్‌ నెలలో తల తిరగడంతో బెంగళూరులోని అనేక ఆసుపత్రులను ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో ఆశ వదులుకున్నారు.ఇటీవల ఇస్కేమిక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత, ఆయన హైదరాబాద్ నాచారంలో ఉన్న ప్రసాద్ ఆసుపత్రిని సంప్రదించారని డాక్టర్లు తెలిపారు. ఇస్కేమిక్ స్ట్రోక్ అనేది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమని గడ్డకట్టడం వల్ల మెదడు కణాలకు ఆక్సిజన్ అందకుండా జరిగే స్థితిగా భావించిన ప్రసాద్ ఆసుపత్రి డాక్టర్లు అత్యవసర వైద్య పరిస్థితి తో రోగికి పలు పరీక్షలు నిర్వహించి సమస్యకు మూల కారణం కెరోటిడ్ వెబ్ అని గుర్తించారు.

తక్షణమే ఆధునిక ఎండ్‌వాస్కులార్ టెక్నిక్ ద్వారా  రక్తనాళంలో ప్రత్యేక స్టెంట్ ను అమర్చి రక్త ప్రవాహం సరి చేశారు.దీంతో రోగిని భవిష్యత్తులో వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం నుంచి రక్షించారు. దాదాపు రెండు గంటల పాటు వృద్ధుడికి శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా పూర్తి చేశారు.ఈ శస్త్రచికిత్సకు నేతృత్వం వహించిన డాక్టర్ సంపత్ (డీఎం, కార్డియాలజీ) మాట్లాడుతూ కెరోటిడ్ వెబ్ అనేది అరుదైనదన్నారు.దీనిని ప్రాథమిక దశలో గుర్తించడం, సమయానికి చికిత్స అందించడం ద్వారా మరిన్ని న్యూరాలజికల్ సమస్యలు నిర్వహించవచ్చని ప్రసాద్ హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు రోగికి అత్యుత్తమ ఫలితాన్ని ఇవ్వడం మాకు ఆనందంగా ఉన్నదని తెలిపారు. ఈ చికిత్సను డాక్టర్ సంపత్ కుమార్ మాడపాటి నేతృత్వంలో డాక్టర్ ఎనోష్, డాక్టర్ సునీల్, పారామెడికల్ ఖాజా, అనురాధ, శ్రీకాంత్ తో కూడిన వైద్య బృందం పాల్గొన్నారు.