calender_icon.png 4 November, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

04-11-2025 08:39:54 PM

సీఐ నాగేశ్వరరావు..

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై, పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ నాగేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం నాగారం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల భద్రత, రక్షణకు రాత్రి, పగలు, ఎండ, వానలు లెక్కచేయకుండా, కుటుంబాలను వదిలి, అనారోగ్యంతో ఉన్నప్పటికీ విధులు నిర్వర్తించి అలసిపోయి కొద్దిపాటి విరామం తీసుకునే సమయంలో దురుద్దేశపూర్వకంగా అర్వపల్లి పోలీస్ స్టేషన్ గేటు నుండి వీడియో చిత్రీకరించి ఎస్ఐ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, పోలీసుశాఖను అగౌరవపరుస్తూ సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేశారన్నారు. వీడియో చిత్రీకరించిన వారిపై, వారిని ప్రోత్సహించిన వారిపై, సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై అర్వపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారిస్తున్నామని చెప్పారు.