calender_icon.png 5 November, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు సిద్దిపేట విద్యార్థిని

04-11-2025 09:08:09 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో ఎడ్యుకేషన్)లో మొదటి సంవత్సరం చదువుతున్న బరిగే కావ్య జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ లో నిర్వహించిన అండర్ 18 మాస్టర్ విభాగంలో గోల్డ్ మెడల్, టైం ట్రావెల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి బేష్ అనిపించుకుంది. నవంబర్ 15న ఒడిశాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో కావ్యను శాలువాతో సత్కరించి, అభినందించారు.

అనంతరం ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. కావ్య పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగుతుందని జాతీయస్థాయిలో రాణించి మరిన్ని మెడల్స్ సాధించి కళాశాలకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిన్న కోడూరు కళాశాల ప్రిన్సిపాల్ కూచంగారి శ్రీనివాస్, కళాశాల ఏజీఎంసి దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్ కనక చంద్రం, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నంట శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దరిపల్లి నగేష్, స్పోర్ట్  ఇంచార్జి అశోక్, కోచ్ వెంకటేష్, అధ్యాపకులు వెంకటరమణ, రఘురాజ్, శ్రీకాంత్, నరేందర్ రెడ్డి, బేతి శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.