04-11-2025 08:42:32 PM
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా జర్నలిస్టులు హైదరాబాద్ కోకాపేట్‌లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కోకాపేట్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బాబురావు, శ్రవణ్, ఇతరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు హరీష్ రావు కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని, దేవుడు ఈ దుఃఖాన్ని భరించే శక్తి ప్రసాదించాలని ప్రార్థించారు.