calender_icon.png 4 November, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ లీకై.. మహిళకు గాయాలు

04-11-2025 08:45:23 PM

నకిరేకల్ (విజయక్రాంతి): గ్యాస్ లీకై ఇంటి గోడ కూలి ఓ మహిళకు గాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం మండలంలోని నోముల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యల్మకంటి లక్ష్మమ్మ ఉదయం వంట చేసి కూలి పనికి వెళ్లే హడావుడిలో గ్యాస్ ను సరిగ్గా బంద్ చేయలేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వంట చేద్దామని స్టవ్ ను వెలిగించే క్రమంలో వెంటనే స్టౌవ్ నుండి మంటలు వచ్చి పేలిపోయింది. ఆ తాకిడికి ఇంటి గోడ సైతం కూలిపోయింది. ఈ ప్రమాదంలో బాధితురాలికి 30 శాతం వరకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వంట సామాగ్రి, కుర్చీలు, బట్టలు కాలిపోయాయి. బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.