7 May, 2026 | 1:02 AM

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం

07-05-2026 12:17 AM

పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

పెనుబల్లి, మే 6 (విజయ క్రాంతి):  పెనుబల్లి మండలం నీలాద్రిక్షేత్రంలో వెలసిన శ్రీ నీలాద్రిశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ పుణ్య కార్యక్రమాల్లో భాగంగా, రెండవ రోజైన బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే  స్వామివారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను, ప్రతిష్టాపన ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీలాద్రి ఆలయ చైర్మన్ చిన్న నరసింహారావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ( ఈవో ), కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, నీలాద్రి ఆలయ డైరెక్టర్లు, కమిటీ సభ్యులు,  పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాధ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.