calender_icon.png 4 October, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శరన్నవరాత్రి దీపోత్సవ వేడుక

04-10-2025 06:12:24 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా తాళ్లపూస పల్లిలో యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహ మండపం వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత చిలువేరు సమ్మయ్య గౌడ్ పాల్గొని, దీపోత్సవ వేడుకను ప్రారంభించారు. అలాగే కల్వల గ్రామంలో దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొని 55 మంది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీ షర్టులు పంపిణీ చేశారు.