04-10-2025 06:14:53 PM
సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఐ సత్తా చాటాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం వలిగొండ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, మోత్కూర్ అడ్డగూడూర్ రామన్నపేట మండలాల ముఖ్య నాయకుల సమావేశం దేవిశ్రీ గార్డెన్ లో బోడ సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐకి బలం ఉన్నచోట్ల ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల పక్షాన పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఐ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ చెడ చంద్రయ్య, ఎండి ఇమ్రాన్, ఏశాల అశోక్, సలిగంజి వీరస్వామి పాల్గొన్నారు.