06-09-2025 12:00:00 AM
మందమర్రి, సెప్టెంబర్ 5: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి మనుబోతుల కొమురయ్య 29వ వర్ధంతి వేడుకలు మందమర్రి ఏరియాలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏరియాలోని కేకే 5 కేకే ఓసిపి ఏరియా వర్క్ షాప్ లతో పాటు గనులు డిపార్ట్ మెంట్ లలో శుక్రవారం మనుబోతుల కొమురయ్య వర్ధంతి వేడుకలను కార్మికుల సమక్షంలో కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ నాయకులు సలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్, కంది శ్రీనివాస్, సోమిశెట్టి రాజేశం, పెద్ద పెళ్లి బానయ్య, రాజేశ్వరరావు, ముల్కలపెళ్లి వెంకటేశ్వర్లు, గోపతి సత్యనారాయణ, సివి రమణ, సాధనవేణి ప్రభాకర్, పిట్ కార్యదర్శిలు మర్రి కుమారస్వామి,
ప్రేమ్ లాల్, పారిపెళ్లి రాజేశం, కలవల శ్రీనివాస్, ఓదెలు, నాయకులు కన్నం వేణు, రాజేశ్ కుమార్ యాదవ్, కొండయ్య, కాసం సమ్మయ్య, పొన్నం శ్రీనివాస్, రాజేందర్, సదానందం, లక్ష్మణ్, విక్రమ్ సింగ్, హేమ చందు,కోటయ్య, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.