06-09-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, సెప్టెంబర్ 5: ఏఐటీయూసీ అగ్ర నేత దివంగత మనుబోతుల కొమురయ్య సేవలు చిరస్మరణీయమని ఆ యూనియన్ రెండు బ్రాంచీల ఇన్చార్జి చిప్ప నరసయ్య అన్నారు. శాంతిఖని గని లో శుక్రవారం సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియ న్ మాజి జనరల్ సెక్రటరీ మనుబోతుల కొమరయ్య 29వ వర్ధంతి సంతాప సభ నిర్వహించారు.
శాంతిఖని గని అసిస్టెంట్ పిట్ సెక్రటరీ మంతెన రమేష్ అధ్యక్షతన జరిగిన కొమురయ్య వర్ధంతి సభలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సింగరేణి కార్మికులకు పెన్షన్, ఇతర హక్కులు సాధించి పెట్టినవి వివరించారు.
ఈ కార్యక్రమ%ళి%లో వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు రాజలింగ్ , మిట్టపల్లి రమేష్, రవి, మైన్స్ కమిటీ సభ్యులు, ప్రశాంతం, సంతోష్ కుమార్, సేఫ్టీ కమిటీ సభ్యులు, అశోక్, రాజేష్ శ్రీకాంత్,గణేష్, బొంకురి రాంచందర్, స్వామి దాసు, కార్మికులు పాల్గొన్నారు.