07-09-2025 01:01:37 AM
అటవీ, పర్యావరణ శాఖమంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు శాస్త్రవేత్తలు చాలా ముఖ్యమైనందున వారికున్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కొండా సురేఖ హామీఇచ్చారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి శాస్త్ర వేత్తల అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ నేతృత్వంలో ఆ సంఘం జనరల్ సెక్రటరీ, కార్యనిర్వాహక సభ్యులు శనివారం మంత్రి కొండా సురేఖను మర్యాద పూర్వకంగా కలిశారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మొట్టమొదటి రిజిస్టర్డ్ అసోసియేషన్ ఏర్పాటు చేశామని మంత్రి సురేఖకు వివరించారు. తమ సమస్యలను ఉన్నత అధికారులకు, ప్రభుత్వానికి తెలియచేయడానికి పర్యావరణ కాలుష్యం నిరోధిం చడానికి ఈ అసోసియేషన్ కృషి చేస్తోందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సైంటిఫిక్ అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా మంత్రికి తమ సమస్యలు, ఇంకా విధుల్లో జరుగుతున్న వివక్షను తెలియజేశారు.
విధుల్లో సముచిత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించ టం లేదని తెలిపారు. ఇటీవల ప్రతిపాదించిన 42 పోస్టుల్లో కేవలం ఎనిమిది పోస్టులు మాత్రమే శాస్త్రవేత్తలకు కేటాయించి మిగతా అంతా ఇంజినీరింగ్ పోస్టులతో కొత్త జోనల్, రీజనల్ ఆఫీసుల ఏర్పాటుకు ప్రతిపాదించారన్నారు. జోనల్ ఆఫీసుల్లో ఏర్పాటుకు జోనల్ ల్యాబ్ కూడా ఉండాలని, కాని వాటిని ప్రతిపాదించలేదని చెప్పారు. ఈ విధంగా అన్నింట తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
శాస్త్రవేత్తలకు కనీసం ఆఫీస్ లాగిన్ ఐడీలు కూడా ఇవ్వకుండా వారిని పర్యావరణ, పరిశ్రమల్లో నమూనాలను సైతం సేకరించడానికి వినియోగించటం లేద ని మంత్రికి తెలిపారు. కాగా వీరి విజ్ఞప్తి మేరకు పీసీబీలో జరుగుతున్న వివక్షకు సం బంధించి పూర్తి వివరాలు తెప్పించుకుని పరిశ్రమల తనిఖీల్లో ఒక శాస్త్రవేత్త ను విధిగా ఉండాలన్న నిబంధనను విధిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ అధికారికి లాగిన్ ఐడీ ఇచ్చే లా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.